Adani Group: అదానీ గ్రూప్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసిన శ్రీలంక

by S Gopi |
Adani Group: అదానీ గ్రూప్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసిన శ్రీలంక
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ బిలీయనీర్, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణల కారణంగా అదానీ గ్రూప్‌తో శ్రీలంక ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని ఉపసంహరించుకున్నట్లు ఆ దేశ ఇంధన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్టు ఓ నివేదిక శుక్రవారం తెలిపింది. అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ గతేడాది అమెరికాలో లంచం తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే అదానీ స్థానిక ప్రాజెక్టులపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ' శ్రీలంక ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసింది. కానీ ప్రాజెక్ట్ రద్దు కాలేదు. మొత్తం ప్రాజెక్ట్‌ను సమీక్షించడానికి ఒక కమిటీని నియమించారు' అని ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్(ఏఎఫ్‌పీ) పేర్కొంది. 2024, మేలో శ్రీలంక ప్రభుత్వం అదానీ గ్రూప్‌తో పవన్ విద్యుత్ ప్లాంట్ నుంచి విద్యుత్ కొనుగోలుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే, ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి సమీక్ష కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీనికోసం కమిటీ ఏర్పాటు చేసినట్టు ఆ దేశ ఇంధన మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి పేర్కొన్నారు.

Next Story

Most Viewed