- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వరుసగా రెండో రోజు నష్టాల్లో సూచీలు!
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో మదుపర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడంతో సూచీలు నీరసించాయి. గురువారం ఉదయం బలహీనంగా ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత మిడ్-సెషన్ వరకు తక్కువ లాభాల్లో కదలాడాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, దేశీయంగా కీలక కంపెనీల షేర్లలో అమ్మకాలు పెరగడంతో నష్టాలు కొనసాగాయి. చివరి గంటలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దూరం జరగడంతో నష్టాలు పెరిగాయి.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 193.70 పాయింట్లు నష్టపోయి 62,428 వద్ద, నిఫ్టీ 46.65 పాయింట్లు కోల్పోయి 18,487 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు నీరసించాయి. ఫార్మా, రియల్టీ, హెల్త్‌కేర్ రంగాలు రాణించాయి.
సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, హిందూస్తాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్, సన్‌ఫార్మా, టీసీఎస్, నెస్లే ఇండియా కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. భారతీ ఎయిర్‌టెల్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.42 వద్ద ఉంది.
Also Read..