Stock Market: అమ్మకాల ఒత్తిడితో తక్కువ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

by S Gopi |
Stock Market: అమ్మకాల ఒత్తిడితో తక్కువ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతోంది. అంతకుముందు సెషన్‌లో రికార్డు గరిష్ఠాలను తాకి కొంత వెనుకబడ్డ సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లోనూ అదే ధోరణిలో కొనసాగాయి. ఉదయం ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతు లేకపోవడం, గరిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు లాభాలను వెనక్కి తీసుకోవడం వల్ల బలహీనంగా కదలాడాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్ సమావేశాల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. మిడ్-సెషన్ తర్వాత అమ్మకాల ఒత్తిడి నుంచి బయటపడ్డ స్టాక్ మార్కెట్లు కోలుకుని తక్కువ లాభాలకు పరిమితమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 99.56 పాయింట్లు లాభపడి 81,455 వద్ద, నిఫ్టీ 21.20 పాయింట్ల లాభంతో 24,857 వద్ద ముగిశాయి. నిఫ్టీలో కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, మీడియా, మెటల్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించాయి. సన్‌ఫార్మా, ఐటీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్‌టెల్, నెస్లె ఇండియా, ఆల్ట్రా సిమెంట్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.73 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed