వరుస లాభాల్లో కొనసాగుతున్న మార్కెట్లకు ఈరోజు ఝలక్!

by Harish |   ( Updated:2023-09-18 11:57:40.0  )
వరుస లాభాల్లో కొనసాగుతున్న మార్కెట్లకు ఈరోజు ఝలక్!
X

దిశ, వెబ్‌డెస్క్: గడిచిన రెండు వారాలుగా లాభాల్లో కొనసాగుతూ ఆల్‌టైం రికార్డు స్థాయిలకు చేరిన స్టాక్‌మార్కెట్ల సూచీలకు ఈ రోజు బ్రేక్ పడింది. సోమవారం ఉదయం ట్రెడింగ్ ప్రారంభంలోనే నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా నష్టాల్లోనే పయనించాయి. ముఖ్యంగా, గత కొద్దిరోజులుగా వస్తున్న లాభాలను ఈ రోజు స్వీకరించడం, అలాగే, అంతర్జాతీయంగా మార్కెట్లో చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలకు దిగడం, చైనాలో ఆర్థిక పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకుతో సహా అగ్రశ్రేణి సెంట్రల్ బ్యాంక్‌ల విధాన నిర్ణయాలు ఎలా ఉండబోతాయోననే ఆందోళనల మధ్య సూచీలు నష్టాల్లో రోజును ముగించాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 241.79 పాయింట్లను కోల్పోయి 67,596.84 వద్ద, నిఫ్టీ 59.05 పాయింట్లను నష్టపోయి 20,133.30 వద్ద ముగిసింది. రియల్టీ, మీడియా, మెటల్, ఐటీ రంగాలు అత్యధికంగా నష్టపోయాయి. ముఖ్యంగా సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే, ఏషియన్ పెయింట్స్ స్టాక్స్ లాభాలను నమోదు చేయగా, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్, విప్రో, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. మార్కెట్లు మగిసే సమయానికి అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 83.27 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed