Retail Inflation: నాలుగు నెలల కనిష్ఠానికి డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం

by S Gopi |
Retail Inflation: నాలుగు నెలల కనిష్ఠానికి డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత రిటైల్ ద్రవ్యోల్బణం దిగొచ్చింది. 2024, డిసెంబ నెలలో నాలుగు నెలల కనిష్ఠ స్థాయి 5.22 శాతానికి తగ్గిందని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటనలో వెల్లడించింది. దీంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ లక్ష్యం 2-6 శాతం పరిధిలోకి చేరుకుంది. వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ప్రధానంగా ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఎన్ఎస్ఓ డేటా ప్రకారం, సమీక్షించిన నెలలో రిటైల్ ద్రవ్యోల్బణంలో ప్రధాన ఆహార ద్రవ్యోల్బణం 8.39 శాతానికి దిగొచ్చింది. ఇది నవంబర్‌లో 9.04 శాతంగా నమోదైంది. మెరుగైన సరఫరా వ్యవస్థ, ఇతర అంశాలు ఇందుకు దోహదపడ్డాయని, కానీ మాంసం, గుడ్లు, చేపల వంటి కొన్ని పదార్థాల ధరలు అంతకుముందు నెల కంటే పెరిగాయని నిపుణులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 5.76 శాతంగా నమోదు కాగా, పట్టణ ద్రవ్యోల్బణం 4.58 శాతానికి తగ్గింది.

Next Story