- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Redmi Note 14: రెడ్‌మీ నోట్ 14 సిరీస్ నుంచి 3 కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే..!

దిశ, వెబ్‌డెస్క్: చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ, షావోమి(Xiaomi) సబ్ బ్రాండ్ రెడ్‌మీ(Redmi) నోట్ 14 సిరీస్ నుంచి 3 కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. రెడ్‌మీ నోట్ 14(Note-14), రెడ్‌మీ నోట్ 14 ప్రో(Note-14 Pro), రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్(Note-14 Pro plus) పేర్లతో వీటిని భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. వీటి ధరలు వేరియంట్ బట్టి రూ. 17,999 నుంచి రూ. 34,999 వరకు ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి సేల్ డిసెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది. రెడ్‌మీ నోట్ 14 అమెజాన్(Amazon)లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. మిగిలిన రెండు ఫోన్లు ఫ్లిప్‌కార్ట్(Flipkart)లో లభిస్తాయి. ఎంఐ(Mi), షావోమి(Xiaomi) రిటైల్ స్టోర్లలో కూడా వీటిని పొందొచ్చు. ఇక స్పెసిఫికేషన్ల విషయానికొస్తే..
రెడ్‌మీ నోట్ 14:
6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో దీన్ని తీసుకొచ్చారు. 120Hz రిఫ్రెష్ రేటు, 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్‌సిటీ 7025 అల్ట్రా చిప్ తో వస్తోంది. అలాగే బ్యాక్ సైడ్ 50 ఎంపీ మెయిన్ కెమెరా, 2 ఎంపీ సెకండ్ కెమెరా, సెల్ఫీల కోసం ముందు వైపు 16 ఎంపీ కెమెరా ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5110mAh బ్యటరీ కలిగి ఉంది.
రెడ్‌మీ నోట్ 14 ప్రో:
120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్‌సిటీ 7,300 అల్ట్రా ప్రాసెసర్ కలిగి ఉంది. 50MP+8MP+2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ముందువైపు ఏఐ సెల్ఫీ కెమెరా అమర్చారు. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీ ఇచ్చారు.
రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్:
6.67 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 3 ప్రాసెసర్‌ను ఇచ్చారు. 50MP+12MP+50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ముందు ఏఐ కెమెరా ఇచ్చారు. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6200mAh బ్యాటరీ కలిగి ఉంది.