- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి వడ్డీ రేట్లు పెరిగితే కష్టమే!
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇళ్ల రుణాలపై వడ్డీ రేట్లు రికార్డు స్థాయికి చేరాయి. ఇప్పుడిప్పుడే కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కే సామాన్యులకు వడ్డీ రేట్ల భారంతో సొంత ఇళ్ల విషయంలో వెనకడుగు వేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే రుణాలు తీసుకున్నవారు పెరిగిన నెలవారీ ఈఎంఐ చెల్లింపుల కోసం ఎక్కువ వెచ్చిస్తున్నారు. గతేడాది నుంచి అధిక ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ పరిణామాలు, మాంద్యం ఆందోళనల మధ్య భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) వరుస సమావేశాల్లో కీలక వడ్డీ రేట్లను పెంచింది. 2022, మే నుంచి ఇప్పటివరకు 250 బేసిస్ పాయింట్లు పెరగడంతో కీలక రెపో రేటు 6.50 శాతానికి చేరింది. తాజాగా, వచ్చే నెల జరగబోయే ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన(ఎంపీసీ) సమావేశంలో మరో 25 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరిగే పాలసీ సమావేశంలో కీలక రేటును పెంచవద్దని రియల్టర్ల సంఘం క్రెడాయ్ గురువారం ఆర్‌బీఐని అభ్యర్థించింది. మరో పెంపు నిర్ణయం తీసుకోవడం వల్ల బిల్డర్లు, ప్రజలు రుణ ఖర్చులను భరించలేదని క్రెడాయ్ అభిప్రాయపడింది. తద్వారా దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. క్రెడాయ్ పెంపు వల్ల ఎదురయ్యే సవాళ్లను ఆర్‌బీఐకి వివరిస్తూ.. ఇప్పటికే డెవలపర్లు ఆర్థిక సవాళ్లను, ఇళ్ల అమ్మకాల్లో క్షీణతను చూస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో రెపో రేటు 4 శాతం నుంచి 6.50 శాతానికి పెరిగింది. మరో పెంపు వల్ల డెవలపర్లకు రుణ ఖర్చు భారమవుతుందని క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు హర్ష్ వర్ధన్ పటోడియా అన్నారు. ప్రస్తుతానికి డెవలపర్లందరూ నిర్మాణ వ్యాయాన్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయని, అలాగే గృహ రుణాల రేట్లు ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకోవడంతో వినియోగదారుల గిరాకీ మరింత క్షీణిస్తుందని క్రెడాయ్ పేర్కొంది.
మొత్తం స్థిరాస్తి రంగంపై ప్రభావం..
గడిచిన ఏడాది కాలంలో ఇళ్ల ధరలు 5-6 శాతం పెరిగాయి. రెపో రేటు మరోసారి పెరగడం వల్ల ప్రాజెక్టుల వ్యయం, ఇళ్ల ధరలు మరింత పెరుగుతాయి. అంతేకాకుండా బిల్డర్లకు లాభాల మార్జిన్లు తగ్గుతాయి. అదేవిధంగా గృహ రుణాలపై వడ్డీ రేట్లు దాదాపు రెండంకెలకు చేరుతాయని, ప్రత్యేకించి టైర్ 1 నగరాల్లో ప్రాపర్టీ కొనుగోళ్లకు ప్రజలు దూరమవుతాయని క్రెడాయ్ తెలిపింది. దానివల్ల మొత్తం స్థిరాస్తి రంగం మందగిస్తుందని, సొంత ఇంటికి కలిగి ఉండాలనే వినియోగదారులు ఇళ్ల కొనుగోళ్లు, నిర్మాణాలను వాయిదా వేస్తారని, కరోనా సవాళ్ల నుంచి బయటపడుతున్న తరుణంలో ఈ ప్రతికూల పరిస్థితి దెబ్బతీయవచ్చని క్రెడాయ్ హెచ్చరించింది. వడ్డీ రేట్లు పెరిగితే అమ్మకాలు పడిపోతాయని ప్రాపర్టీ కన్సల్టెంట్లు, డెవలపర్లు కూడా భావిస్తున్నారు. ఇళ్ల కొనుగోలు నిర్ణయాలు గృహమరోసారి వడ్డీ రేట్లు పెరిగితే కష్టమే! రుణాల రేట్ల ఆధారంగానే కాకుండా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆర్‌బీఐ కీలక రేట్ల పెంపు రియల్ ఎస్టేట్ డిమాండ్‌పై ప్రభావం చూపుతుందని హౌసింగ్ డాట్ కామ్ సీఈఓ ధృవ్ అగర్వాలా చెప్పారు.
10 శాతానికి మించిపోవచ్చు..
ప్రస్తుతం గృహ రుణాలపై ప్రారంభ వడ్డీ రేట్లు 9.5 శాతం ఉండగా, గరిష్ఠంగా రెండంకెల పైనే ఉంది. ఇప్పటికే వినియోగదారులు ఈఎంఐలు పెరిగినందున, వడ్డీ రేటు మరింత పెరిగితే సామాన్యులు ఇంకాస్త ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని కొలియర్స్ ఇండియా రీసెర్చ్ హెడ్ విమల్ నాడార్ అన్నారు. ఏప్రిల్ 6న జరిగే ఆర్‌బీఐ పాలసీ సమావేశంలో కీలక రేట్లు పెంచితే గృహ రుణాల వడ్డీ రేట్లు సైతం 10 శాతానికి మించి పెరిగిపోతుంది. ఇది స్థిరాస్తి కొనుగోళ్లు, డిమాండ్‌పై గణనీయమైన ప్రభావం చూపుతుందని రియల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ ఛైర్మన్ ప్రదీప్ అగర్వాల్ పేర్కొన్నారు.