- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సందేహాలను నివృత్తి చేసేలా RBI స్పెషల్ నోట్
దిశ, తెలంగాణ బ్యూరో: రెండు వేల రూపాయల నోట్ల చెలామణిని పూర్తిగా రద్దు చేయకుండా ఆంక్షలు మాత్రమే విధించిన రిజర్వుబ్యాంకు అనేక సందేహాలను నివృత్తి చేసేలా స్పెషల్ నోట్‌ను కూడా విడుదల చేసింది. రెండు వేల నోట్లను సెప్టెంబరు చివరి వరకూ బ్యాంకుల్లో మార్చుకోవాలని సూచనలు చేసింది. ఆ తర్వాత మార్చుకోకపోయినా నష్టమేమీ లేదని, రోజువారీ లావాదేవీలు జరుపుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది. అయితే గడువులోగా మార్చుకుంటే మంచిదంటూ సూచనగా తెలియజేసింది. సెప్టెంబరు తర్వాత ‘లీగల్ టెండర్’గా కంటిన్యూ అవుతుందని, నోటును రద్దు చేసేంత వరకు చెలామణిలోనే ఉంటుందని స్పష్టత ఇచ్చింది. సెప్టెంబరు 30 తర్వాత కూడా బ్యాంకుల్లో రెండు వేల నోట్లను ఖాతాల్లో జమచేయవచ్చు. కానీ ఇతర నోట్లలోకి మార్పిడి చేసుకోడానికి మాత్రం అవకాశం ఉండదు. ఈ నోట్లన్నీ లీగల్‌గా లెక్కల్లోకి వచ్చేలాగనే చెలామణి అవుతుంది. ఈ మేరకు రిజర్వు బ్యాంకు ఒక నోట్‌ను విడుదల చేసింది.
= రెండు వేల రూపాయల నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయి.
= మే 23 నుండి ఒకేసారి రూ. 20,000 వరకు మార్చుకోవచ్చు.
= బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా కూడా గరిష్టంగా రోజుకు రూ. 4 వేల వరకు మార్చుకోవచ్చు.
= నిర్దిష్టంగా బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచ్‌లోనే రెండు వేల నోటును మార్చుకోవాలన్న నిబంధమనేమీ లేదు. ఖాతా లేకపోయినా ఏ బ్యాంక్ బ్రాంచ్‌లోనైనా ఒకేసారి ₹20,000/- పరిమితి వరకు మార్చుకోవచ్చు.
= బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయదల్చుకుంటే ఎలాంటి పరిమితులూ ఉండవు. ఎంత మొత్తంలోనైనా రెండు వేల రూపాయల నోట్లను జమ చేయవచ్చు. డ్రా కూడా చేసుకోవచ్చు.
= సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బ్యాంకు అధికారులే ప్రత్యేక సౌకర్యాన్ని, ప్రయారిటీని ఏర్పాటుచేస్తారు.
= నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి అసౌకర్యం లేకుండా నాలుగు నెలలకు పైగా సమయం ఉన్నది.
= నోట్లను మార్చుకోవడానికి, డిపాజిట్ చేసుకోడానికి బ్యాంకులు నిరాకరించకుండా ఇప్పటికే ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. అయినా సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చేయవచ్చు. అప్పటికీ సమస్యలుంటే రిజర్వ్ బ్యాంక్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద కంప్లైంట్ చేయొచ్చు.
ఇవి కూడా చదవండి: