- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
డెబిట్, క్రెడిట్ కార్డ్ డేటా నిల్వ చేయకుండా పేమెంట్ అగ్రిగేటర్ల నిబంధనలు కఠినతరం

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నాన్-బ్యాంకింగ్ సంస్థలకు సంబంధించి పేమెంట్ అగ్రిగేటర్ల నిబంధనలను కఠినతరం చేస్తూ ప్రతిపాదించింది. ప్రధానంగా డెబిట్, క్రెడిట్ కార్డుల డేటా నిల్వకు సంబంధించి కీలక నోటిఫికేషన్ ఇచ్చింది. ఆర్‌బీఐ కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం, 2025, ఆగష్టు 1 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులను కార్డ్ ఆఫ్ ఫైల్(సీఓఎఫ్) డేటా నిల్వ చేసేందుకు పేమెంట్ అగ్రిగేటర్లకు అనుమతి ఉండదు. డేటా నిల్వ చేసేందుకు వీసా, మాస్టర్ కార్డ్, బ్యాంకులు వంటి కార్డు జారీ సంస్థలు, కార్డ్ నెట్‌వర్క్‌లకు మాత్రమే ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. గతంలో నిల్వ చేసిన డేటాను తప్పనిసరిగా తొలగించాలి. పేమెంట్ అగ్రిగేటర్లు కార్డు నంబర్‌లోని చివరి నాలుగు అంకెలు, కార్డు జారీ చేసిన సంస్థ పేరు వంటి పరిమిత డేటా మాత్రమే కలిగి ఉండొచ్చు. ఈ నిబంధనలు ప్రస్తుతం డ్రాఫ్ట్ దశలోనే ఉన్నాయని, మిగిలిన ప్రక్రియల అనంతరం అమలు చేయనున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.