త్వరలో నాణెల కోసం వెండింగ్ మెషీన్‌లు: RBI !

by Harish |   ( Updated:2023-02-08 12:29:36.0  )
త్వరలో నాణెల కోసం వెండింగ్ మెషీన్‌లు: RBI !
X

ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బుధవారం ఎంపీసీ సమావేశం అనంతరం కీలక ప్రకటన వెల్లడించింది. దేశవ్యాప్తంగా 12 నగరాల్లో క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్(క్యూసీవీఎమ్)లను తీసుకురానున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. నాణెలు కావాలానుకునే వారు ఈ వెండింగ్ మెషీన్‌లు ఉపయోగించవచ్చని, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నాణెలను తీసుకునేందుకు వీలుంటుందని దాస్ వివరించారు.

ప్రస్తుతానికి ఈ కార్యక్రమం పైలట్ ప్రాజెక్ట్ రూపంలో పరిమిత నగరాల్లో మొదలవుతాయని, ప్రస్తుతం నగదు తీసుకునేందుకు అందుబాటులో ఉన్న ఏటీఎం మెషీన్‌ల మాదిరిగానే ఇవి పనిచేస్తాయని దాస్ చెప్పారు. కాయిన్ వెండింగ్ మెషీన్‌లలో కాయిన్‌ల కోసం యూపీఐ ద్వారా బ్యాంకు అకౌంట్ నుంచి మెషీన్ స్క్రీన్‌పై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, నగదు చెల్లించిన అనంతరం నాణెలను తీసుకోవచ్చు.

ప్రయోగాత్మకంగా 12 నగరాల్లో ప్రారంభమయ్యే ఈ మెషీన్‌లను 19 ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తామని, ఇవి ప్రధానంగా ప్రజల రద్దీ ఉండే రైల్వే స్టేషన్, షాపింగ్ మాల్స్‌లోని కూడళ్లలో ఏర్పాటు చేయనున్నారు. పైలెట్ ప్రాజెక్టుకు వచ్చే స్పందన ఆధారంగా క్యూసీవీఎమ్‌ల విస్తరణపై బ్యాంకులకు మార్గదర్శకాలు పంపడం జరుగుతుందని ఆర్‌బీఐ పేర్కొంది.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story