- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
RBI : ద్రవ్యల్బణం వల్ల కీలక వడ్డీరేట్లు యథాతథం.. ఆర్బీఐ గవర్నర్

దిశ, బిజినెస్: ద్రవ్యోల్బణం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. వరుసగా పదకొండోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. డిసెంబరు 4 నుంచి మూడు రోజుల పాటు ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరిగింది. ఆ నిర్ణయాలనే శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) వెల్లడించారు. ద్రవ్యోల్బణం, ఇతర అంశాలను దృష్టిలోపెట్టుకొని వడ్డీరేట్లలో మార్పులు చేయొద్దని నిర్ణయించినట్లు తెలిపారు. ఈసారి స్థిరవిధాన వైఖరిని కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. రెపో రేటు (Repo rate)ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (MPC) రెపో రేటును 4:2 మెజారిటీతో 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోంది. రేట్ల తగ్గింపు కోసం ఎదురుచూస్తున్న వారికి ఈసారి నిరాశే కలిగింది.
ముఖ్యాంశాలివే..
2024-25లో వాస్తవ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.6శాతానికి తగ్గించింది. గత ద్వైమాసిక సమీక్షలో దీన్ని 7.2 శా తంగా అంచనా వేయగా.. ప్రస్తుతం కాస్త తగ్గించాల్సి వచ్చింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో వృద్ధిరేటు అంచనాల కంటే తక్కువగా 5.4శాతంగా ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలు పెరిగాయి. గతంలో దీన్ని 4.5శాతంగా పేర్కొనగా.. ప్రస్తుతం 4.8శాతంగా ఉండొచ్చని అంచనా. ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం అంచనాలను పెంచాల్సి వచ్చింది. అక్టోబరులో ద్రవ్యోల్బణం శాతానికి మించి పెరిగింది. వచ్చే త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని ఆర్బీఐ అంచనావేసింది.
2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ కరెంట్ ఖాతా లోటు స్థిరంగా ఉంటుంది. ద్రవ్యలభ్యత మిగులుస్థాయిలోనే ఉంది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు బలంగా కొనసాగుతున్నాయి. ఆర్థిక రంగం ఉత్తమంగా ఉంది. క్యాష్ రిజర్వ్ రేషియోను 4.5శాతం నుంచి 4 శాతానికి తగ్గించింది. బ్యాంకులకు రూ.1.16 లక్షల కోట్ల నగదును అందుబాటులో ఉంచింది. రూపాయి విలువను బలోపేతం చేసేందుకు ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లపై వడ్డీరేటు పరిమితిని పెంచింది. వ్యవసాయ రంగంలో తనఖా లేని రుణాల పరిమితిని రూ.1.6లక్షల నుంచి రూ.2లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.