సూపర్ ఆఫర్: Flipkartతో Paytm భాగస్వామ్యం.. రూ. 50 క్యాష్‌బ్యాక్

by Harish |   ( Updated:2022-09-15 13:25:14.0  )
సూపర్ ఆఫర్: Flipkartతో Paytm భాగస్వామ్యం.. రూ. 50 క్యాష్‌బ్యాక్
X

బెంగళూరు: దేశీయ ప్రముఖ డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం రానున్న పండుగ సీజన్ కోసం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ ' ది బిగ్ బిలియన్ డేస్ ' సమయంలో చెల్లింపుల కోసం ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది.

ఈ భాగస్వామ్యం ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసే వినియోగదారులు పేటీఎం యూపీఐ ద్వారా రూ. 250, అంతకంటే ఎక్కువ కొనుగోలు చేస్తే రూ. 25 తక్షణ క్యాష్‌బ్యాక్, పేటీఎం వ్యాలెట్ ద్వారా రూ. 500, అంతకంటే ఎక్కువ విలువైన షాపింగ్ చేస్తే రూ. 50 క్యాష్‌బ్యాక్ లభిస్తుందని పేటీఎం తెలిపింది.

పండుగ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలను అందించనున్నాం. అంతేకాకుండా చిన్న నగరాలు, పట్టణాల్లో లక్షల మంది వినియోగదారులకు సురక్షితమైన, మెరుగైన చెల్లింపు సేవలు లభిస్తాయని పేటీఎం ప్రతినిధి తెలిపారు.

రెండు స్వదేశీ బ్రాండ్‌ల మధ్య భాగస్వామ్యం వల్ల వినియోగదారులకు సులభమైన షాపింగ్, చెల్లింపుల సేవలు అందించాలని భావిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్, పేటీఎం వెల్లడించాయి.

Advertisement

Next Story