- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'4 కా 100 క్యాష్‌బ్యాక్': రూ.4 తో 100 రూపాయలు పొందండి

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ Paytm వినియోగదారులకు కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. 4 రూపాయలను ఇతరులకు పేటీఎం యూపీఐ ద్వారా పంపడం వలన రూ.100 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఇండియా vs వెస్టిండీస్ ODI & T20 మ్యాచ్‌ల కోసం paytm ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు ఉంటుంది. మ్యాచ్‌డేస్‌లో, కొత్త యూజర్‌లు '4 కా 100 క్యాష్‌బ్యాక్ ఆఫర్'ని పొందవచ్చు. ఇది కాకుండా, వినియోగదారులు రిఫరల్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం ద్వారా అదనపు క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకోవచ్చు. UPI నగదు బదిలీ కోసం Paytm ని ఉపయోగించడానికి స్నేహితులు, కుటుంబ సభ్యులను రెఫర్ చేయడం ద్వారా ఇద్దరు రూ. 100 క్యాష్‌బ్యాక్‌ను పొందగలరని కంపెనీ తెలిపింది.
Paytm వైస్ ప్రెసిడెంట్ నరేంద్ర యాదవ్ మాట్లాడుతూ, Paytm UPI సూపర్‌ఫాస్ట్ మనీ ట్రాన్స్‌ఫర్‌లను అందిస్తోంది. రాబోయే క్రికెట్ సీజన్‌లో, వినియోగదారుల కోసం ఈ ఆఫర్‌ను తెచ్చాము. దీనిలో పాల్గొని రూ. 100 క్యాష్‌బ్యాక్ పొందవచ్చని తెలిపారు. వినియోగదారులు మొబైల్ యాప్‌లో Paytm UPI సర్వీసులను యాక్టివేట్ చేసుకొని, తమ బ్యాంక్ ఖాతా నుండి నేరుగా ఆన్‌లైన్ చెల్లింపులను, Paytm UPI ని ఉపయోగించి క్షణాల్లో డబ్బులను ఇతరులకు పంపవచ్చు అని నరేంద్ర యాదవ్ అన్నారు.