- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్యంత ఖరీదైన పెంట్‌హౌస్‌ను కొన్న బజాజ్ ఆటో ఛైర్మన్ నీరజ్ బజాజ్!
ముంబై: దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్‌హౌస్‌ను ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ఛైర్మన్ నీరజ్ బజాజ్ కొనుగోలు చేశారు. ముంబైలోని మలబార్ హిల్‌లో సముద్రానికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌ను రూ. 252.5 కోట్లు వెచ్చించి కొన్నారు. దీంతో భారత్‌లోనే అత్యంత ఖరీదైన ఫ్లాట్‌ను కొన్న వ్యక్తిగా నీరజ్ బజాజ్ నిలిచారు. ఈ అపార్ట్‌మెంట్ 18,008 చదరపు అడుగుల వైశాల్యంతో ఎనిమిది కార్ పార్కింగ్ స్లాట్‌లను కలిగి ఉంది.
2021 నుంచి బజాజ్ ఆటో ఛైర్మన్‌గా ఉన్న నీరజ్ బజాజ్ మాక్రొటెక్ డెవలపర్‌ల నుంచి ఈ లగ్జరీ బీచ్ వ్యూ అపార్ట్‌మెంట్ కోసం రూ. 15.15 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్టు మనీకంట్రోల్ తన కథనంలో తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలోనే వెల్‌స్పన్ గ్రూప్ ఛైర్మన్ బికె గోయెంకా, డీ మార్ట్ అధినేత రాధాకిషన్ దమానీలు రెండు అతిపెద్ద రియల్టీ కొనుగోలు నిర్వహించారు.
ఫిబ్రవరిలో రాధాకిషన్ దమానీ భారత్‌లోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఒప్పందంగా సుమారు రూ. 1,238 కోట్లకు 28 లగ్జరీ అపార్ట్‌మెంట్‌లను కొన్నారు. అలాగే, అదే నెలలో వెల్‌స్పన్ గ్రూప్ ఛైర్మన్ బికె గోయెంకా రూ. 230 కోట్లతో ఒబెరాయ్ రియల్టీకి చెందిన లగ్జరీ ప్రాజెక్ట్ ఓర్లీ పెంట్‌హౌస్‌ను కొన్నారు.