- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్టుస్, టైగూన్ కొత్త వేరియంట్లు విడుదల చేసిన ఫోక్స్‌వ్యాగన్!
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ దేశీయ మార్కెట్లో తన కొత్త వర్టుస్, టైగూన్ కొత్త వేరియంట్లతో పాటు జీటీ ఎడ్జ్ ప్రత్యేక ఎడిషన్ మోడల్లను విడుదల చేసింది. కొత్త మోడళ్లలో వర్టుస్ జీటీ ప్లస్ మాన్యూవల్, టైగూన్ జీటీ డీఎస్‌జీ, టైగూన్ జీటీ ప్లస్ మాన్యూవల్ కార్లు ఉన్నాయి. గడిచిన పదేళ్ల నుంచి భారత వినియోగదారుల నుంచి ఆదరణ లభించడం సంతోషంగా ఉంది. ఈ క్రమంలోనే మెరుగైన పనితీరు, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త వేరియంట్లను తీసుకొస్తున్నామని ఫోక్స్‌వ్యాగన్ పాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా చెప్పారు.
వర్టుస్ 7-స్పీడ్ డీఎస్‌జీ ట్రాన్స్‌మిషన్‌తో పాటు 6-స్పీడ్ మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్‌ను తీసుకొచ్చాం. అలాగే, టైగూన్6లో రెండు కొత్త వేరియంట్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. కొత్త వేరియంట్లలో టైగూన్ జీటీ డీఎస్‌జీ, టైగూన్ జిఈటీ ప్లస్ మాన్యూవల్ ఉన్నాయి. ధరల పరంగా టైగూన్ జీటీ డీఎస్‌జీ రూ. 16.79 లక్షల నుంచి 19.45 లక్షల మధ్య ఉంది. వర్టుస్ మోడల్ ధరలు రూ. 16.89 లక్షల నుంచి 18.76 లక్షల మధ్య ఉందని కంపెనీ వెల్లడించింది.