మార్చి నుంచి మీ జేబులు ఖాళీ అయ్యే కొత్త రూల్స్.. అవి ఏంటో ఒకసారి చూద్దాం!

by Harish |
మార్చి నుంచి మీ జేబులు ఖాళీ అయ్యే కొత్త రూల్స్.. అవి ఏంటో ఒకసారి చూద్దాం!
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త ఏడాది ఆర్థిక సంవత్సరంలో పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రేపు మార్చి 1 వ తారీఖు. ఈ నెలలో పాత రూల్స్ స్థానంలో కొత్తవి రానున్నాయి. ఇవి ప్రజల జీవితాలను కొంత వరకు ప్రభావితం చేయనున్నాయి. మరి ఆ మార్పులు ఏంటి?.. వాటి గురించి పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం..

పాన్-ఆధార్ లింక్ చివరి తేదీ

అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డులలో ఒకటైన పాన్ (PAN) కార్డును, ఆధార్ కార్డ్‌తో అనుసంధానం చేయాలి. ఇప్పటికే ఈ విషయంలో చివరి తేదీని చాలా సార్లు పొడిగించిన కేంద్రం ఇప్పుడు చివరి తేదీని మార్చి 31, 2023గా పేర్కొంది. ఈ తేదీలోపు ప్రజలు తమ పాన్-ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డు నిరూపయోగం కానుంది.


భారంగా EMI‌లు

ద్రవ్యోల్బణం కారణంగా ఇటీవల వరుసగా ఆర్బీఐ రెపో రేటును పెంచుతున్న సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు కూడా ప్రజలు తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఈఎంఐల ద్వారా ఏదైనా వస్తువులు కొనుగోలు చేసిన వినియోగదారులు ఇకమీదట మరింత ఎక్కువ వడ్డీతో ఈఎంఐలు చెల్లించాలి. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి మొదలుకుని ప్రైవేటు రంగ బ్యాంకుల వరకు అన్ని కూడా తమ వినియోగదారులపై ఈఎంఐల భారాన్ని పెంచాయి. దీంతో లోన్లపై వడ్డీ ఎక్కువగా ఉండనుంది.


LPG, CNG ధరల పెంపు

ఈ మధ్య కాలంలో ఎల్‌పీజీ, సీఎన్‌జీ, పీఎన్‌జీ గ్యాస్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికి రానున్న పండుగల నేపథ్యంలో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


సోషల్ మీడియా

అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాట్‌ఫామ్స్‌ పై వచ్చే ఫిర్యాదులు పరిష్కరించేందుకు మూడు కంప్లైంట్ అప్పీలేట్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కమిటీలు మార్చి 1 నుంచి పనిచేస్తాయి.



Advertisement

Next Story