- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ టాప్-10 లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్ల జాబితాలో ముంబై
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే టాప్-10 లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్లలో ముంబై స్థానం దక్కించుకుంది. నగరంలో లగ్జరీ ఇళ్ల ధరలు పెరగడంతో ముంబై 8వ ర్యాంకును దక్కించుకుంది. ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్‌కు చెందిన ది వెల్త్ రిపోర్ట్-2024 నివేదిక ప్రకారం, ఈ జాబితాలో భారత్ నుంచి దేశ రాజధాని ఢిల్లీ 37వ స్థానం, బెంగళూరు 59వ స్థానంలో నిలిచాయి. గతేడాది ప్రైమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్(పీఐఆర్ఐ) విలువ 3.1 శాతం పెరిగింది. ఇది గణనీయమైన పెరుగుదల. 100 లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్లలో 80 నగరాల్లో ధరలు పెరిగాయి. ర్యాంకింగ్స్‌లో మనీలా(26 శాతం)లో ధరలు అత్యధికంగా పెరుగుదల నమోదవగా, దుబాయ్(16 శాతం), బహమాస్(15 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక, ముంబై నగరం 2022లో 37వ ర్యాంకు సాధించగా, ఆ తర్వాత ఏడాది వ్యవధిలో పీఐఆర్ఐ ఇండెక్స్‌లో 8వ ర్యాంకుకు ఎగబాకింది. ముంబైలో లగ్జరీ రెసిడెన్షియల్ ధరలు 10 శాతం పెరిగాయి. ఈ కారణంతోనే ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి ప్రవేశించింది. ఇక, ఢిల్లీలో ధరలు 4.2 శాతం, బెంగళూరులో 2.2 శాతం ధరలు పెరిగాయి.
ఇక, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా మొనాకో కొనసాగుతోంది. ఈ నగరంలో 1 మిలియన్ డాలర్లకు కేవలం 16 చదరపు మీటర్ స్థలం కొనవచ్చు. దీని తర్వాత హాంకాంగ్ 1 మిలియన్ డాలర్లకు(22 చ.మీ), సింగపూర్(32 చ.మీ) ఉన్నాయి. ముంబైలో 1 మిలియన్ డాలర్లకు అంటే రూ. 8.3 కోట్లకు 103 చ.మీ(అంటే 2.54 సెంట్లు) కొనవచ్చు.