- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈవీ పరికరాల కోసం మహీంద్రా, ఫోక్స్‌వ్యాగన్ ఒప్పందం
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ వాహన మార్కెట్లో వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల కోసం దిగ్గజ సంస్థలు ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్, మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. భవిష్యత్తులో ఈవీల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఎంఅండ్ఎంకు చెందిన ఇంగ్లో ఈవీ ప్లాట్‌ఫామ్‌లో ఫోక్స్‌వ్యాగన్ ఎంఈబీ ఎలక్ట్రిక్ విడిభాగాలు, యూనిఫైడ్ సెల్స్‌ను వినియోగించనున్నారు. ఈ-మొబిలిటీ ప్రోత్సాహానికి తమ భాగస్వామ్యం మరింత మద్దతిస్తుందని భావిస్తున్నట్టు ఇరు కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ఫోక్స్‌వ్యాగన్ తన 80 శాతం బ్యాటరీ సెల్స్‌లో ఎంఈబీ సాంకేతికతను ఉపయోగించాలని యోచిస్తోంది. ఎంఈబీ సాంకేతికతలో బ్యాటరీ ప్యాక్ ఫ్లోర్ బోర్డుకు ఉంటుంది. దీనివల్ల ఖర్చులను సగానికి తగ్గించవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ భాగస్వామ్యంతో, మహీంద్రా కంపెనీ బ్యాటరీ వినియోగంలో వోక్స్‌వ్యాగన్ యూనిఫైడ్ సెల్ కాన్సెప్ట్‌ను ఉపయోగించిన మొదటి బయటి వాహన తయారీ సంస్థగా అవతరించింది. ఈ ఒప్పందం దేశీయంగా ఈ-మొబిలిటీ విస్తరణను గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.