- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైన మెటా!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా మరో రౌండ్ భారీ లేఆఫ్స్‌ను ప్రారంభించింది. రెండో రౌండ్ లేఆఫ్స్ ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం బుధవారం నుంచి ప్రారంభమవుతుందని, ముందుగా టెక్నికల్ విభాగాల్లో తొలగింపులు ఉంటాయని కంపెనీ ప్రతినిధి స్పష్టం చేసినట్లు నివేదికలు తెలిపాయి. అయితే, ఎంతమందిని తొలగించనున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
భారత్‌లో సైతం తొలగింపులు బుధవారం నుంచే మొదలవుతాయని సూచనలు కనిపించాయి. సాయంత్రం వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు. మెటాలోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలోని అన్ని విభాగాల్లో ఉద్యోగులను తగ్గించాలని కంపెనీ భావిస్తోంది. ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు కంపెనీ గతంలోనే ప్రకటించింది.
తాజా తొలగింపులకు సంబంధించి మేనేజర్లకు మెయిల్ ద్వారా సమాచారం అందించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మే నెలలో సైతం మరికొంత మందిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతేడాది నవంబరులో 11 వేల మందిని తీసేసిన మెటా, కొత్త నియామకాలను చేపట్టలేదు. మార్చిలో మరో 10 వేల మంది లేఆఫ్స్ ప్రకటించింది. ఏప్రిల్ నెలకు సంబంధించి ఎంతమంది అనే దానిపై స్పష్టత లేనప్పటికీ, 4 వేల మందిని ఇంటికి సాగనంపవచ్చని సమాచారం.