వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా పూర్తవనున్న టాటా స్టీల్‌లో 7 సంస్థల విలీనం!

by Vinod kumar |
వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా పూర్తవనున్న టాటా స్టీల్‌లో 7 సంస్థల విలీనం!
X

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన ఏడు కంపెనీలు ఒకే గొడుగు కిందకు చేర్చనున్నట్టు కంపెనీ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మెటల్ రంగంలో ఉన్న ఆరు అనుబంధ కంపెనీలను టాటా స్టీల్‌లో విలీనం చేసే ప్రణాళికను కంపెనీ కలిగి ఉంది. దీనికి సంబంధించి ఆదివారం టాటా స్టీల్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ టీవీ నరేంద్రన్ మాట్లాడుతూ, ఈ ప్రక్రియ 2023-24 ఆర్థిక సంవత్సరంలోగా పూర్తవుతుందని స్పష్టం చేశారు.

ఎన్‌సీఎల్‌టీ క్లియరెన్స్‌లతో పాటు నియంత్రణా ప్రక్రియలపై ఆధారపడి విలీన ప్రక్రియ ఉంటుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా ఇది ముగుస్తుందని ఆయన వివరించారు. గతేడాది సెప్టెంబర్‌లో తయారీలో సహకారంతో పాటు, గ్రూప్‌ వాటాలను, యాజమాన్యాన్ని మరింత సులభతరం చేయడం, కార్యకలాపాలు, ఇంజినీరింగ్‌ సామర్థ్యాలను మరింత సమర్థవంతం చేయడంలో భాగంగా కంపెనీ విలీన నిర్ణయం తీసుకుంది.

కంపెనీ వివరాల ప్రకారం, అంగుల్ ఎనర్జీతో పాటు టాటా స్టీల్ టాటా స్టీల్‌ ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌, టిన్‌ప్లేట్‌ కంపెనీ, టాటా మెటాలిక్స్‌, ది ఇండియన్‌ స్టీల్‌ అండ్‌ వైర్‌ ప్రోడక్ట్స్‌, పూర్తిగా టాటా స్టీల్‌ అనుబంధ కంపెనీలైన టాటా స్టీల్‌ మైనింగ్‌, ఎస్‌అండ్‌టీ మైనింగ్‌ కంపెనీలు టాటా స్టీల్‌లో విలీనం అవనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed