బిల్‌గేట్స్‌ను దాటిన మార్క్ జూకర్‌బర్గ్

by Harish |   ( Updated:2024-02-04 08:21:46.0  )
బిల్‌గేట్స్‌ను దాటిన మార్క్ జూకర్‌బర్గ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: మెటా అధినేత మార్క్ జూకర్‌‌బర్గ్ ప్రపంచధనవంతుల జాబితాలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను అధిగమించి నాలుగో స్థానంలో నిలిచారు. ఇటీవల మెటా తన త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత కంపెనీ షేర్లు దాదాపు 20 శాతం రాణించడంతో వాటి విలువ 28.1 బిలియన్ డాలర్లకు పెరిగి మొత్తం జూకర్‌బర్గ్ సంపాదన $170.5 బిలియన్లకు చేరుకుంది, దీంతో ఆయన ప్రపంచ ధనవంతుల జాబితాలో నాలుగో స్థానానికి చేరారు.

మరోవైపు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌ గేట్స్ $165 బిలియన్లతో ఐదో స్థానంలో ఉన్నారు. గతంలో వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం కారణంగా 2022లో 35 బిలియన్ డాలర్లకు దిగువకు పడిపోయిన జుకర్‌బర్గ్ సంపద ఇప్పుడు క్రమంగా పుంజుకుంటుంది. అలాగే ఆయన మెటాలో దాదాపు 350 మిలియన్ క్లాస్ A, B షేర్లను కలిగి ఉన్నారు. వీటి ద్వారా ఆయనకు కంపెనీ నుంచి మార్చిలో డివిడెండ్ రూపంలో $174 మిలియన్లను అందుకోనున్నారు. జుకర్‌బర్గ్ తనకు ఉన్నటువంటి షేర్ల ద్వారా ప్రతి ఏడాది దాదాపు $700 మిలియన్ల డివిడెండ్‌ను అందుకుంటారు.

ఇటీవల కాలంలో మెటా తన ఫెస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఎక్కువగా ఖర్చు చేస్తుంది. ఇతర విభాగాలకు కేటాయింపులను పెంచుకోవడానికి మెటా సుమారు 21,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, జుకర్‌బర్గ్ కంటే ముందు ముగ్గురు మాత్రమే ధనవంతుల జాబితాలో ఉన్నారు, వారు.. బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్.

Advertisement

Next Story

Most Viewed