- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
L&T నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్న ఏఎం నాయక్!
ముంబై: మౌలిక సదుపాయాల దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఏఎం నాయక్ తన పదవి నుంచి వైదొలిగారని కంపెనీ బుధవారం ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆయన బాధ్యతలు కొనసాగించనున్నారు. అనంతరం ఆయన ఎల్అండ్‌టీ బోర్డు గౌరవ ఛైర్మన్‌గా కొనసాగుతారని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రస్తుతం సీఈఓ, ఎండీగా ఉన్న ఎస్ఎన్ సుబ్రమణ్యన్ ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి కంపెనీ ఛైర్మన్, ఎండీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఎల్అండ్‌టీ కంపెనీకి 58 సంవత్సరాకు పైగా ఏఎం నాయక్ సేవలందించారని, ఆయన సారథ్యంలో కంపెనీ విలువ అనేక రెట్లు పెరిగింది. ఎల్అండ్‌టీని అన్ని రంగాల్లో రాణించడమే కాకుండా ప్రపంచ స్థాయి సంస్థగా మలచడంలో ఆయన కీలకపాత్ర పోషించారని కంపెనీ తెలిపింది. ఆయన లీడర్‌షిప్‌లో సంస్థ ఆదాయం, మార్కెట్ క్యాప్ గణనీయమైన వృద్ధి సాధించింది.
1965లో దేశీయ అతిపెద్ద ఇంజనీరింగ్ సంస్థల్లో ఒకటైన ఎల్అండ్‌టీలో జూనియర్ ఇంజనీర్‌గా చేరిన ఏఎం నాయక్, జనరల్ మేనేజర్, మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా ఎదిగారు. 2003, డిసెంబర్ 9న సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. 2012-2017 మధ్య ఎల్అండ్‌టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నారు. 2017, అక్టోబర్‌లో ఎగ్జిక్యూటివ్ బాధ్యతల నుంచి తప్పుకుని గ్రూప్ ఛైర్మన్‌గా నియమించబడ్డారు.