- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గుడ్‌న్యూస్: రైతులు, మత్స్యకారులు, స్వయం సహాయక బృందాలకు 4 శాతం వడ్డీకే రుణాలు
దిశ, వెబ్‌డెస్క్: రైతును రాజును చేయడానికి ప్రతి ఏడాది పెట్టుబడి సాయంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM KISAN Scheme) ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 6000 లను సన్నకారు, చిన్నకారు రైతులకు అందిస్తుంది. దీని ఉద్ద్యేశం పంటలు వేసే సమయంలో అయ్యే ఖర్చులకు ఆర్థికంగా రైతులకు తోడ్పాటు అందించడం. అయితే ప్రభుత్వం ఈ సాయాన్ని అందివ్వడమే కాకుండా రుణాలు కూడా అందిస్తుంది. ఈ రుణాలకు వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. ఈ రుణాల ద్వారా రైతులకు మరింత ప్రయోజనాలు చేకురుతాయని కేంద్రం ఆలోచన. అందుకే ఈ రుణాల కోసం ప్రత్యేకంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్‌ను అందిస్తుంది.
ఈ స్కీమ్ ద్వారా రైతులు రూ. 3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. పైగా బీమా కవరేజ్ సదుపాయం కూడా ఉంది. రుణం తీసుకున్న రైతు వైకల్యానికి గురైనా, మరణించినా రూ.50,000 వరకు బీమా లభిస్తుంది. సాధారణ వడ్డీ రేటు వార్షికంగా 7 శాతం ఉంటుంది. కానీ కిసాన్ క్రెడిట్ కార్డుపై రాయితీతో వడ్డీ రేటు 4 శాతం వరకు ఉంటుంది. అది కూడా రుణాలను సకాలంలో చెల్లిస్తేనే. ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా రూ. 1.60 లక్షల వరకు రుణాలు తీసుకోవచ్చు.
వ్యవసాయ భూమి కలిగిన వారు లేదా సాగుదారు కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. సొంతంగా లేదా ఇతరులతో కలిపి ఒక బృందంగా ఏర్పడి రుణాలు పొందవచ్చు. లోన్ చెల్లింపు సదుపాయం మూడు సంవత్పరాల వరకు లేదా పంట చేతికి వచ్చాక కూడా తిరిగి చెల్లించవచ్చు. ఇందులో స్మార్ట్ కార్డ్, డెబిట్ కార్డ్ సదుపాయం ఉంది. పాడి రైతులు, పశుపోషణ, మత్స్యకారులు, స్వయం సహాయక బృందాలు మొదలగు వారు రుణాలు పొందవచ్చు. ఇతర పూర్తి సమాచారం కోసం సంబంధిత అధికారులను సంప్రదించగలరు.