Jensen Huang: నేను వాచ్ పెట్టుకోను: ఎన్‌విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-11 14:16:58.0  )
Jensen Huang: నేను వాచ్ పెట్టుకోను: ఎన్‌విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాకు చెందిన ఏఐ చిప్(AI Chip)ల తయారీ కంపెనీ ఎన్‌విడియా(Nvidia) ఇటీవలే ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా అవతరించిన విషయం తెలిసిందే. ప్రముఖ టెక్ దిగ్గజం, ఐఫోన్ల(iphones) తయారీ సంస్థ యాపిల్‌(Apple)ను వెనక్కి నెట్టి మార్కెట్ వాల్యూ పరంగా మొదటి స్థానంలో నిలిచింది. త్వరలో ఏఐ సూపర్‌ కంప్యూర్స్ చిప్స్‌(AI Supercomputers Chips) తీసుకురానుందన్న వార్తలతో కంపెనీ షేర్‌ విలువ అమాంతం పెరిగింది. దీంతో స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌విడియా షేర్ల విలువ 3.53 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. యాపిల్ విలువ 3.52 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇదిలా ఉంటే ఎన్‌విడియా ఫౌండర్, సీఈఓ(Nvidia Founder, CEO) జెన్సన్ హువాంగ్(Jensen Huang) ఓ టెక్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. తాను చేతికి వాచ్(Watch) ధరించనని, ప్రస్తుతం అనేది అత్యంత ముఖ్యమైన సమయమని, నేను ప్రస్తుతం చేస్తున్న పనినే మరింత మెరుగ్గా చేయాలనుకుంటున్నాను అని తెలిపారు. ఉన్నది వదిలేసి నాకు ఎక్కువ చేయాలనే కోరిక లేదు, ప్రపంచమే నా దగ్గరకు వస్తుందని నేను ఎదురు చూస్తా. అందుకే నేను వాచ్ పెట్టుకోను" అని హువాంగ్ అన్నారు. అలాగే ఎన్విడియాకు దీర్ఘకాలిక వ్యూహమేమి(Long Term Strategy) లేదని ఆయన పేర్కొన్నారు.

Next Story

Most Viewed