జనవరి-మార్చిలో భారీగా తగ్గిన కాంట్రాక్ట్ ఉద్యోగులు!

by Harish |   ( Updated:2023-05-25 12:54:12.0  )
జనవరి-మార్చిలో భారీగా తగ్గిన కాంట్రాక్ట్ ఉద్యోగులు!
X

న్యూఢిల్లీ: భారత్‌లో ప్రస్తుతం భారీ సంఖ్యలో ఉద్యోగాల తొలగింపులు జరుగుతున్నాయి. ముఖ్యంగా టెక్ రంగంలో ఇది ఎక్కువగా ఉంది. ప్రముఖ రిక్రూట్‌మెంట్ సంస్థ ప్రకారం, ప్రపంచ మందగమనం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో గత త్రైమాసికం కంటే ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య సుమారు 6 శాతం ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు భారత ఐటీ రంగంలో ఉద్యోగాలు కోల్పోయారు.

సుమారు 60 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను అందించిన 120 రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలను కలిగిన ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ సమీక్షించిన కాలంలో ఆరు శాతం లేదా 3,600 మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఈ ధోరణి రానున్న కొన్ని త్రైమాసికాల పాటు ఈ పరిస్థితి ప్రతికూలంగానే ఉండనుంది.

ఐటీ రంగంలో కొత్త ఉపాధి తగ్గిపోవడం ప్రపంచ మందగమనానికి అద్దం పడుతుందని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు లోహిత్ భాటియా అన్నారు. కాగా, ప్రముఖ థింగ్ ట్యాంక్ సీఎంఐఈ ప్రకారం, ఏప్రిల్‌లో భారత నిరుద్యోగ రేటు వరుసగా నాలుగో నెలలో 7.8 శాతం నుంచి 8.11 శాతానికి పెరిగింది. ఐటీతో పాటు ఇతర రంగాల్లోనూ కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్ పడిపోయిందని లోహిత్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed