సీఈఓ బైజూ రవీంద్రన్‌కు వ్యతిరేకంగా ఇన్వెస్టర్ల దావా

by S Gopi |   ( Updated:2024-02-23 11:47:19.0  )
సీఈఓ బైజూ రవీంద్రన్‌కు వ్యతిరేకంగా ఇన్వెస్టర్ల దావా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక ఇబ్బందుల్లో తలమునకలైన ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ మరో కొత్త సమస్యను ఎదుర్కొనబోతోంది. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ బైజూ రవీంద్రన్‌ను తొలగించేందుకు ప్రతిపాదిస్తూ కంపెనీ ఇన్వెస్టర్లు సిద్ధమవుతున్నారు. అందుకోసం ప్రత్యేక ఈజీఎం నిర్వహించి, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) బెంగళూరు బెంచ్ ముందు బైజూ రవీంద్రన్, యాజమాన్యంపై దావా వేశారు. సీఈవో బైజూ రవీంద్రన్‌తో సహా వ్యవస్థాపకులు కంపెనీని నడపడానికి అనర్హులుగా ప్రకటించాలని, కంపెనీకి కొత్త బోర్డును నియమించాలని వారు కోరుతున్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన రైట్స్ ఇష్యూను రద్దు చేస్తూ, కంపెనీపై ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశాలు జారీ చేయాలని ఎన్‌సీఎల్‌టీనీ కోరారు. అలాగే, ఇన్వెస్టర్ల హక్కులను నిర్లక్ష్యం చేసే ఎటువంటి కార్పొరేట్ చర్యలను కూడా కంపెనీ యాజమాన్యం తీసుకోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కంపెనీలోని వాటాదారుల విలువను రక్షిస్తూ, ఉద్యోగులు, వినియోగదారుల ప్రయోజనాల భద్రత కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. దావా వేసిన ఇన్వెస్టర్లలో జనరల్ అట్లాంటిక్, ప్రోసస్, పీక్ ఎక్స్‌వీ, సోఫినా ఉన్నాయి. వ్యవస్థాపకుల కారణంగా ఉత్పన్నమైన ఆర్థిక అవకతవకలతో బైజూస్ అనుబంధ కంపెనీ ఆకాశ్‌పై నియంత్రణలో తమకు పట్టు తగ్గుతోందని, బైజూస్ ఆల్ఫా కంపెనీ దివాలా స్థాయికి పడిపోయింది. రీట్స్ ఇష్యూ వ్యవహారంలో సైతం నిబంధనలు పాటించలేదని ఇన్వెస్టర్లు ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed