Crude Oil: నవంబర్‌లో తగ్గిన రష్యా చమురు దిగుమతి.. 2022, జూన్ తర్వాత అత్యల్పం

by S Gopi |
Crude Oil: నవంబర్‌లో తగ్గిన రష్యా చమురు దిగుమతి.. 2022, జూన్ తర్వాత అత్యల్పం
X

దిశ, బిజినెస్ బ్యూరో: రష్యా నుంచి భారత చమురు దిగుమతులు తగ్గాయి. నవంబర్‌లో రష్యా ముడి చమురు దిగుమతులు భారీగా 55 శాతం తగ్గాయి. ఇవి 2022, జూన్ తర్వాత కనిష్టమని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) తన తాజా నివేదికలో పేర్కొంది. ముడి చమురు దిగుమతులు పడిపోయినప్పటికీ రష్యానే ఇప్పటికీ భారత అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగుతోందని యూరోపియన్ థింక్ ట్యాంక్ నెలవారీ ట్రాకర్ తెలిపింది. రష్యా నుంచి ముడి చమురు ఎగుమతుల్లో 47 శాతంతో చైనాయే కొనుగోలు చేయగా, ఆ తర్వాత భారత్ 37 శాతం, ఈయూ 6 శాతం, టరంకీ 6 శాతం కొంటున్నాయని సీఆర్ఈఏ వెల్లడించింది. 2022, ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పటి నుంచి, రష్యా ముడి చమురు రెండవ అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్ అవతరించింది. దానివల్ల మనదేశం మొత్తం చమురు దిగుమతులలో రష్యా చమురు వాటా ఒక శాతం నుంచి దాదాపు 40 శాతానికి పెరిగింది. రష్యా మిడి చమురు దిగుమతులు అక్టోబరులో రోజుకు 1.67 మిలియన్ బారెల్స్ నుంచి 4 శాతం క్షీణించి 1.60 మిలియన్ బ్యారెల్స్‌కు క్షీణించినట్టు వోర్టెక్సా డేటా పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed