- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CAIT: ఇ-కామర్స్ కంపెనీలపై నిరసనకు దిగిన వ్యాపారుల సంఘం
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలకు వ్యతిరేకంగా భారతీయ వ్యాపారులు, రిటైలర్ల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఈ-కామర్స్ కంపెనీల తీరుపై పెద్ద నిరసనను ప్రారంభించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) నిర్ణయించింది. కొన్నేళ్ల నుంచి విదేశీ రిటైల్ ఈ-కామర్స్ కంపెనీలపై పోరాడుతున్న సీఏఐటీ ఆదివారం ఢిల్లీలో 'ప్రాసిక్యూట్' చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు అనుసరిస్తున్న వ్యాపార పద్దతులను ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేయనున్నాయి. ఈ విషయంపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించనున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాల్లో అక్రమాలు జరిగాయని దాదాపు 350 మందికి పైగా ట్రేడర్స్ భావిస్తున్న్నారు. ఇటీవల సీసీఐ చిన్న, మధ్య తరహా వ్యాపారులను తీవ్రంగా ప్రభావితం చేసే అనైతిక పద్దతులను బహిరగం చేసిన సంగతి తెలిసిందే. వాటిలో భారీ తగ్గింపులు, ఎంచుకున్న విక్రయదారులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం, నిబంధనలను ఉల్లంఘిచడం వంటివి ఉన్నాయి. దీనివల్ల లక్షలాది మంది వ్యాపారులు, రిటైలర్లు కోలుకోలేని నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలను విచారించి, న్యాయం జరిగేలా చూడాలని సీఏఐటీ డిమాండ్ చేస్తోంది.