మరో ఏడాది కల్లా రూ. 1.28 లక్షల కోట్లకు ఎలక్ట్రానిక్స్ తయారీ!

by Harish |   ( Updated:2023-02-17 16:30:07.0  )
మరో ఏడాది కల్లా రూ. 1.28 లక్షల కోట్లకు ఎలక్ట్రానిక్స్ తయారీ!
X

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రూ.1.28 లక్షల కోట్లను దాటుతుందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ తయారీని విస్తరించే చర్యలు తీసుకుంటోంది, ఐటీ హార్డ్‌వేర్, పరికరాల తయారీ కంపెనీల కోసం ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని అమలు చేయబోతోంది. దీని ద్వారా మొత్తం ఎలక్ట్రానిక్స్ తయారీ వచ్చే ఏడాది నాటికి కనీసం రూ. 1.28 లక్షల కోట్లను అందుకోగలదని, అలాగే, 2023-24లో మొబైల్‌ఫోన్‌ల ఉత్పత్తి రూ.లక్ష కోట్లను అధిగమిస్తుందని ఆయన తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మొబైల్‌ఫోన్‌ ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారించడం ద్వారా అనుకున్న లక్ష్యం చేరుకోగలమని వెల్లడించారు. కాగా, ఎలక్ట్రానిక్ భాగాల తయారీ రంగం సెమీకండక్టర్లు కాకుండా ఇతర ఎలక్ట్రానిక్ భాగాలు, కీలక మాడ్యూళ్ల తయారీకి వచ్చే ఎనిమిదేళ్లకు రూ. 80 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.

Advertisement

Next Story

Most Viewed