Housing Prices: ఈ ఏడాది భారీగా పెరగనున్న ఇళ్ల ధరలు, అద్దెలు

by S Gopi |
Housing Prices: ఈ ఏడాది భారీగా పెరగనున్న ఇళ్ల ధరలు, అద్దెలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఇళ్ల ధరలు, అద్దె ఖర్చులు భారీగా పెరగనున్నాయని పరిశ్రమ నిపుణులు తెలిపారు. ఈ పెరుగుదల ద్రవ్యోల్బణం కంటే ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. అధిక ఆదాయాల కారణంగా గడిచిన దశాబ్ద కాలంలో ఇళ్ల ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. తాజాగా అధిక డిమాండ్, పరిమిత సరఫరా మధ్య వ్యత్యాసం పెరగడంతో ఇళ్ల ధరలు మరింత పెరిగాయి. దీనివల్ల లక్షలాది మంది అద్దె ఇళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా ఇళ్ల ధరలతో పాటు అద్దెలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఇటీవల రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో ప్రముఖ ప్రాపర్టీ మార్కెట్ నిపుణుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం, దేశంలో సగటున ఇళ్ల ధరలు ఈ ఏడాది 6.5 శాతం పెరగనుంది. వచ్చే ఏడాది 6 శాతం పెరగవచ్చని అభిప్రాయపడ్డారు. గతేడాది సుమారు 4 శాతం పెరిగాయని వారు తెలిపారు. అలాగే, పట్టణ ప్రాంతాల్లో అద్దె ధరలు ఇళ్ల ధరల కంటే ఎక్కువగా ఉండనున్నట్టు నిపుణులు తెలిపారు. ఈ ఏడాది అద్దె ధరలు కనీసం 7-10 శాతం మేర పెరగనున్నాయి. అద్దె ధరలు పెరగడంతో మొదటిసారి ఇళ్లను కొనాలనుకునే వారు సొంత ఇంటికి డౌన్ పేమెంట్ కోసం పొదుపు చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా లక్షలాది మంది సొంత ఇంటి కలకు దూరమవుతున్నారని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Next Story

Most Viewed