EPFO Scheme: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా అకౌంట్లోకి రూ. 50వేలు

by Vennela |   ( Updated:2025-01-14 10:10:39.0  )
EPFO Scheme: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా అకౌంట్లోకి రూ. 50వేలు
X

EPFO Scheme: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO Scheme) ..దేశంలోని కార్మికుల ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తన కస్టమర్లకు లేదా సబ్ స్కైబర్లకు సరైన రిటైర్మెంట్ పొదుపు ప్లాన్స్ (Retirement savings plans)అందిస్తుంది. చాలా మంది ఈపీఎఫ్ఓ(EPFO) కు సంబంధించి కొన్ని రూల్స్ తెలియవు. అందులో ఒకటి లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్స్(Loyalty Come Life Benefits) . ఈ రూల్ ప్రకారం పీఎఫ్ ఖాతాదారులు 50వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే దీనికో ఖండిషన్ ఉంటుంది. ఆ ఖండిషన్ ఏంటి..ఈ 50వేలు పొందేందుకు ఎవరు అర్హులో ఇప్పుడు తెలుసుకుందాం.

పీఎ ఖాతాదారులు ఉద్యోగం మారిన తర్వాత కూడా అదే పీఎఫ్ ఖాతా(PF account)కు సహకారం అందించడం కొనసాగించాలి. ఈ రూల్ ఒకే అకౌంట్ లో వరుసగా 20ఏళ్లు విరాళం అందించిన కస్టమర్లకు లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ స్కీమ్(Loyalty cum Life Benefit Scheme) పొందేందుకు అర్హులు అవుతారు. ఖాతాదారులు వరుసగా 20ఏళ్లుగా తన ఈపీఎఫ్ అకౌంట్ విరాళాలు(EPF account contributions) ఇస్తుంటే..అతను లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్స్ ను పొందవచ్చని సీబీడీటీ(CBDT) సిఫార్సు చేస్తోంది. ఈ స్కీంకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. దీని ద్వారా 20సంవత్సరాలుగా చందాదారులు రూ. 50వేలు అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు.

లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్(Loyalty Come Life Benefits) కింద రూ. 5000వేల జీతం పొందే వ్యక్తులు రూ. 30వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. రూ. 5000, రూ. 10000 మధ్య బేసిక్ సాలరీ జీతం డ్రా చేసే వారు కూడా రూ. 40వేలు పొందవచ్చు. రూ. 10, 000 కంటే ఎక్కువ మూల వేతనం డ్రా చేసే వ్యక్తులు రూ. 50వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.

ఈపీఎఫ్ఓ సబ్ స్కైబర్స్(EPFO subscribers) ఉద్యోగం మారిన తర్వాత కూడా వారి సింగిల్ ఈపీఎఫ్ అకౌంట్ కు కంట్రిబ్యూట్(Contribution to EPF account) చేడానికి కొనసాగించడం సరిపోతుంది. ఉద్యోగం మారిన తర్వాత మీరు మీ ప్రస్తుత కంపెనీ మీ పాత కంపెనీ గురించి సమాచారాన్ని అందించాలి. మీరు ఈ ఖండిషన్ అనుసరించినట్లయితే..మీరురూ. 50వేల అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు.

Next Story

Most Viewed