ICICI Bank: ఐఫోన్ 16, ఇతర యాపిల్ ఉత్పత్తులపై ఐసీఐసీఐ బ్యాంక్ ప్రత్యేక ఆఫర్లు

by S Gopi |
ICICI Bank: ఐఫోన్ 16, ఇతర యాపిల్ ఉత్పత్తులపై ఐసీఐసీఐ బ్యాంక్ ప్రత్యేక ఆఫర్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ పండుగ సీజన్‌కు ఈ-కామర్స్ కంపెనీలు ప్రారంభించిన సేల్ కోసం ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐఫోన్ 16తో పాటు యాపిల్ ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లను అందించనుంది. ఈ ఆఫర్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు తమ క్రెడిట్ కార్డు కొనుగోళ్లతో పాటు డెబిట్/క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఈఎంఐ ద్వారా చేసే కొనుగోళ్లపై రూ. 5,000 వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే, యాపిల్ వాచ్‌పై రూ. 2,500 క్యాష్‌బ్యాక్, ఎయిర్‌పాడ్‌లపై రూ. 1,500 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాంక్ లభిస్తుంది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని బ్యాంక్ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. అదనంగా, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు కస్టమర్ల కోసం 'ఐఫోన్ ఫర్ లైఫ్' ప్రోగ్రామ్ ద్వారా ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. దీని ద్వారా ఐఫోన్ మోడళ్లపై 24 నెలల వడ్డీ రహిత ఈఎంఐ ఆప్షన్ లభిస్తుంది. ఐఫోన్ అప్‌గ్రేడ్ చేసుకునేందుకు గ్యారెంటీ బై బ్యాక్ ఆప్షన్ అవకాశం ఉందని బ్యాంకు పేర్కొంది.

Advertisement

Next Story