- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్లాక్ ఫ్రైడే సందర్భంగా Samsung భారీ తగ్గింపు
దిశ, వెబ్‌డెస్క్: సామ్‌సంగ్ కంపెనీ వినియోగదారుల కోసం ''బ్లాక్ ఫ్రైడే'' సందర్బంగా డిస్కౌంట్ సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్ ఇండియాలో నవంబర్ 24న ప్రారంభమై నవంబర్ 28న ముగుస్తుంది. నాలుగు రోజుల పాటు జరగనున్న బ్లాక్ ఫ్రైడే సేల్‌లో వివిధ రకాల ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరకు అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా సామ్‌సంగ్ మొబైల్ ఫోన్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్ టీవీలపై తగ్గింపులతో పాటు, నో-కాస్ట్ EMI ఎంపికలు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. కొనుగోలు సమయంలో హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డులపై తగ్గింపులు కూడా లభిస్తాయి.
Galaxy Z Flip 4 అసలు ధర రూ. 89,999, కానీ సేల్‌లో రూ. 80,999 కు లభిస్తుంది. అలాగే, Galaxy Z Flip 3 రూ. 67,999, Galaxy S21 FE 5G రూ. 40,000 లోపు, Galaxy F23 5G రూ. 14,000 లోపు, ఇంకా Samsung 65-అంగుళాల స్మార్ట్ TV, Galaxy Buds 2, Galaxy Watch 5, సౌండ్ బార్‌లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్‌లు, టాబ్లెట్‌లు, ఎయిర్ కండిషనర్లు మొదలగు ఉత్పత్తులను భారీ తగ్గింపుతో బ్లాక్ ఫ్రైడే సేల్‌లో వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు.