ఆధార్ కార్డులో తప్పులను ఎన్నిసార్లు మార్చుకోవచ్చంటే!

by Harish |   ( Updated:2023-03-09 06:00:35.0  )
ఆధార్ కార్డులో తప్పులను ఎన్నిసార్లు మార్చుకోవచ్చంటే!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు అంటే మొదట గుర్తుకు వచ్చేది, ఆధార్ కార్డు. UIDAI సంస్థ వారు జారీ చేసే ఈ కార్డు, వివిధ ప్రభుత్వ పథకాలను పొందడానికి ఉపయోగపడుతుంది. దీనిలో సమాచారం అత్యంత భద్రంగా ఉంటుంది. ఏదైనా ప్రభుత్వం పథకాలను గానీ, లేదా ఇతర అవసరాలకు దీని సమాచారం ప్రామాణికంగా ఉంటుంది.

మరి అంత అవసరమైన ఆధార్‌లో పౌరులకు సంబంధించిన పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ మొదలగు వివరాలు నమోదు చేయబడి ఉంటాయి. వీటిని ఒక్కసారి ఎంటర్ చేశాక, మార్చడం కుదరదు. ఒక వేళ వాటిలో ఏవైనా తప్పులు ఉంటే మాత్రం సరిదిద్దుకోవచ్చు. అయితే వీటి వివరాలను తరుచూ మార్చడం కుదరదు. ఒక లిమిట్ ప్రాతిపదికన మార్చడానికి అవకాశం ఉంటుంది.

మరి ఏ అంశాలను ఎన్నిసార్లు మార్చవచ్చో ఒకసారి చూద్దాం.

పేరు(Name): ఆధార్‌లో తప్పుగా పడిన పేర్లు, స్పెల్లింగ్‌ మిస్టేక్‌లను రెండు సార్లు మార్చుకోడానికి అవకాశం ఉంది.

జెండర్: ఆధార్‌లో జెండర్(లింగం) తప్పుగా పడినప్పుడు ఒక్కసారి మార్చుకోవచ్చు.

పుట్టిన తేదీ: ఆధార్ కార్డు లో పుట్టిన తేదీని తప్పుగా నమోదు చేసినట్లయితే, ఒక్కసారి మాత్రమే సరిదిద్దుకోవచ్చు.

అయితే ఇంటి అడ్రస్, మొబైల్ నెంబర్, ఫొటో, వేలిముద్ర, ఇమెయిల్ ఐడి, కంటి స్కాన్‌లు అప్‌డేట్ చేయడానికి ఎలాంటి పరిమితి లేదు.

Read more:

SBI ఖాతాదారులకు గుడ్‌న్యూస్: రూ. 25 వేల వరకు భారీ ఆఫర్లు

Advertisement

Next Story

Most Viewed