Flight Tickets: హోలీ ఆఫర్‌..రూ.1199కే ఫ్లైట్ టికెట్ బుకింగ్‌.. పూర్తి వివరాలివే!

by Vennela |
Flight Tickets:  హోలీ ఆఫర్‌..రూ.1199కే ఫ్లైట్ టికెట్ బుకింగ్‌.. పూర్తి వివరాలివే!
X

దిశ, వెబ్‌డెస్క్: Indigo Holi Sale: ఒక్కప్పుడు విమాన ప్రయాణం(Flight Tickets) అంటే అబ్బో అనేవారు. ధనవంతులు మాత్రమే విమానాల్లో ప్రయాణించేవారు. కానీ ఇప్పుడు విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. టికెట్ ధరలు(Flight Tickets) కూడా అందుబాటులోకి రావడం ఒక కారణం అయితే..ప్రజల సంపాదన పెరగడం కూడా మరో కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా పండగలు, ప్రత్యేక కార్యక్రమాలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ సేల్స్ ను ప్రకటిస్తున్నాయి దిగ్గజ విమానయాన సంస్థలు(Airlines). దీంతో చాలా తక్కువ ధరలకే విమాన టికెట్లను అందిస్తుంటాయి. చాలా వరకు ఇయర్ ఎండ్, న్యూఇయర్, క్రిస్మస్, సంక్రాంతి, హోలీ(Indigo Holi Sale), ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, దీపావళి వంటి సందర్భంగాల్లో సేల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈమధ్యే ఎయిరిండియా ఎక్స్ ప్రైస్ పే డే సేల్ తీసుకువచ్చింది. ఇప్పుడు అదే బాటలో ఇండిగో విమానాయాన సంస్థ కూడా కీలక ప్రకటన చేసింది

ఇండిగో ఇప్పుడు హోలీ పండగను పురస్కరించుకుని హోలీ గేట్ అవే సేల్(Indigo Holi Sale) లాంఛ్ చేసింది. దీనికోసం 2025 మార్చి 10 నుంచి 12లోపు టికెట్లు బుక్ చేసుకోవాలి. దీని కింద దేశీయరూట్లలో రూ.1199 నుంచి ప్రారంభం అవుతుంది. సాధారణంగా బస్ టికెట్లు కూడా కొన్నింటిపై ఇవే ధరలు ఉంటున్నాయి. అదే అంతర్జాతీయ అయితే ఫేర్స్ రూ. 4199నుంచి ప్రారంభం అవుతాయి. గోఇండిగో. ఇన్(Indigo) లో బుక్ చేసినట్లయితే అదనంగా మరో 5శాతం తగ్గించుకోవచ్చు. ఇవి వన్ వే ఫేర్.

ఇండిగో ఇప్పుడు తన కస్టమర్లకు, ఏజెంట్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్లైట్ టికెట్ బుకింగ్స్(Flight Tickets) పై డిస్కౌంట్ ధరల్లో టికెట్లు అందిస్తుంది. యాడ్స్ ఆన్స్ కూడా ఆఫర్ చేసింది. దీనిని ఇండిగో వెబ్ సైట్ లేదా ఇండిగో మొబైల్ యాప్ లేదా ఇండిగో 6ESkai లేదా ఇండిగో వాట్సాప్ లేదా ఇతర ట్రావెల్ పార్టనర్ వెబ్ సైట్ మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. ఆఫర్ పీరియడ్ మార్చి 10 నుంచి 12లోపు ఉండగా 2025 మార్చి 17 నుంచి సెప్టెంబర్ 21 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు.

ఫ్లైట్ టికెట్లపై డిస్కౌంట్(Discount on flight tickets) ఇవ్వడంతోపాటుగా ఇతర యాడ్స్ ఆన్స్ కూడా అందిస్తోంది. ప్రీ పెయిడ్ ఎక్సెస్ బ్యాగేజీపై 20శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇది దేశీయ, ఇంటర్నెషనల్ రూట్లలో వర్తిస్తుంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సెక్టార్లలో స్టాండర్డ్ సీట్ సెలక్షన్ కోసం 35శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది. ప్రీ బుక్ మీల్స్ పై 10శాతం తగ్గింపు ఉంది. డిస్కౌంట్లు, ఎయిర్ పోర్టు ఛార్జీలు, ప్రభుత్వ పన్నులు, ఇతర రుసుములపై వర్తించవు. కనెక్టింగ్ కోడ్ షేర్ ఫ్లైట్లపై ఈ ఆఫర్ లేదు. ఇండిగో నాన్ స్టాప్ ఫ్లైట్లపై ఉంటుంది. ఇది వన్ వే బుకింగ్స్ పైనే చెల్లుబాటు అవుతుంది. రౌండ్ ట్రిప్, మల్టీ సిటీ బుకింగ్స్ కు ఉండదు.

Next Story

Most Viewed