GST on Insurance: జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గించే అవకాశం

by S Gopi |
GST on Insurance: జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గించే అవకాశం
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొద్దిరోజులుగా జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ తొలగించాలనే డిమాండ్ ఊపందుకుంది. ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాల్లో వాడివేడి చర్చ జరగడమే కాకుండా ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా కీలక పార్టీల అధినేతల నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తులు పెరిగాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం జీఎస్టీ తగ్గించాలని కోరుతూ ఆర్థిక మంత్రికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీవిత, ఆరోగ్య బీమాలపై పూర్తిగా జీఎస్టీ తొలగించడం కంటే తగ్గింపునకు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే ప్రతిపాదనలను జీఎస్టీ రేటు రేషనలైజేషన్ కమిటీకి పంపినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్టు జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి. ఈ నెలాఖరులో జరగనున్న కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed