Google Pixel: భారత మార్కెట్లో పిక్సెల్ 9 మోడల్ ఫోన్‌లు విడుదల చేసిన గూగుల్

by S Gopi |
Google Pixel: భారత మార్కెట్లో పిక్సెల్ 9 మోడల్ ఫోన్‌లు విడుదల చేసిన గూగుల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ గూగుల్ సంస్థ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోడల్ పిక్సెల్ 9లో కొత్త సిరీస్ విడుదల చేసింది. ఈ సిరీస్‌లో పిక్సెల్ 9 ప్రో, 9 ప్రో ఎక్స్ఎల్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రధానంగా కెమెరా, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌పై దృష్టి సారిస్తూ వీటిని తీసుకొచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ సిరీస్‌లో కొత్త టెన్సార్ జీ4 చిప్ అమర్చబడి ఉందని, ముఖ్యంగా రెండు ఫోన్‌లు 16జీబీ ర్యామ్‌తో వస్తాయని కంపెనీ తెలిపింది. వీటిలో మల్టీ టాస్కింగ్‌కి అనుగుణంగా యాప్, గేమ్‌లలో మెరుగైన పనితీరు కోసం ముఖ్యమైన అప్‌గ్రేడ్ ఉందని వెల్లడించింది. మునుపటి మోడళ్లతో పోలిస్తే ఇవి పెద్ద బ్యాటరీలతో వస్తాయి. పిక్సెల్ 9 ప్రో ఒకసారి ఛార్జ్ చేస్తే 36 గంటలు పనిచేస్తుంది. ప్రో ఎక్స్ఎల్ 40 గంటల వరకు పనిచేస్తుంది. ధరలకు సంబంధించి.. పిక్సెల్ 9 ప్రో ధర రూ. 1,09,999, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ రూ. 1,24,999 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది.

Advertisement

Next Story