Matrimony FinTech : మ్యాట్రిమోనీ కస్టమర్లకు గుడ్ న్యూస్

by M.Rajitha |   ( Updated:2024-11-15 13:28:08.0  )
Matrimony FinTech : మ్యాట్రిమోనీ కస్టమర్లకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : పెళ్ళి సంబంధాలు కుదిర్చే మాట్రిమోని(Matrimony.com) సంస్థ కస్టమర్లకు ఓ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రస్తుత రోజుల్లో పెళ్లి సంబంధం కుదరటం అనేది ఎంత కష్టమో.. పెళ్లి ఖర్చులు భరించడం కూడా అంతే కష్టతరంగా మారింది. వధువు, వరుడు ఇరువైపుల వారికి పెళ్లి ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. అప్పటివరకు చేసుకున్న సేవింగ్స్ అన్నీ పెళ్ళికి ఖర్చు చేయడమో.. అవి సరిపోకపోతే అప్పు చేయడమో చేసేవారు. కాగా రాన్రాను పెళ్లి ఖర్చులకు భయపడి అసలు పెళ్లి చేసుకోవడమే మానేస్తున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి పెళ్లి కష్టాలు తప్పించడానికి చెన్నై(Chennai)కి చెందిన మాట్రిమోని డాట్ కామ్ సంస్థ ఆర్థిక రుణాలు అందించడానికి కొత్త ప్లాట్‌ఫామ్ ను ప్రారంభించింది. దీనిలో ప్రముఖ ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో పెళ్లిళ్లకు రుణాలు అందించనుంది. తద్వారా వధువు, వరుడు తరపున పెళ్లి ఖర్చులకు అక్కడా ఇక్కడా అధిక వడ్డీకి అప్పులు తేవాల్సిన శ్రమ తప్పినట్టు అవుతుందని చెన్నై మాట్రిమోని సీఈఓ మురుగవేల్ జానకిరామన్ అన్నారు.

Advertisement

Next Story