- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
గోఫస్ట్ విమాన లీజు సంస్థల పిటిషన్‌లపై 22న ఎన్‌సీఎల్ఏటీ ఉత్తర్వులు!
న్యూఢిల్లీ: బడ్జెట్ క్యారియర్ గోఫస్ట్ దాఖలు చేసిన స్వచ్చంద దివాలా పిటిషన్‌ని వ్యతిరేకిస్తూ మూడు విమాన లీజు కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌లపై ఎన్‌సీఎల్ఏటీ వచ్చే వారం 22న ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపింది. మూడు పిటిషన్‌లపై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్ఏటీ) ఛైర్-పర్శన్ జస్టిస్ అశోక్ భూషణ్ అధ్యక్షతన బెంచ్ విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్ చేసింది. ఇరు పక్షాలు ఇంకా ఏమైనా అదనపు పత్రాలు ఉంటే 48 గంటల్లోగా సమర్పించాలని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
విమాన లీజు సంస్థలైన ఎస్ఎంబీసీ ఏవియేషన్ కేపిటల్, ఎస్ఎఫ్‌వీ ఎయిర్‌క్రాఫ్ట్ హోల్డింగ్, జీవై ఏవియేషన్‌లు గోఫస్ట్ దివాలా అభ్యర్థనను సవాలు చేస్తూ పిటిషన్‌లను దాఖలు చేశాయి. ఈ నెల ప్రారంభంలోనే వివిధ విమాన లీజు సంస్థలు గోఫస్ట్ యాజమాన్యంపై విమాన నియంత్రణ సంస్థ డీజీసీఏకు ఫిర్యాదు చేశాయి. కంపెనీకి చెందిన 45 విమానాల రిజిస్ట్రేషన్‌లను రద్దు చేసి తిరిగి స్వాధీనం చేసుకోవాలని భావించాయి.
కాగా, ఈ నెల 3న గోఫస్ట్ తన విమాన కార్యకలాపాలను నిలిపేసిన సంగతి తెలిసిందే. ప్రాట్ అండ్ విట్నీ కంపెనీ ఇంజిన్‌ల సరఫరా ఆలస్యం చేయడం వల్ల విమాన సర్వీసులను కొనసాగించేందుకు నిధులు లేక ఇబ్బందుల్లో ఉన్నట్టు గోఫస్ట్ పేర్కొంది.