ఆగష్టులో ఇప్పటివరకు రూ. 8,400 కోట్లు పెట్టుబడి పెట్టిన ఎఫ్‌పీఐలు!

by Dishaweb |
ఆగష్టులో ఇప్పటివరకు రూ. 8,400 కోట్లు పెట్టుబడి పెట్టిన ఎఫ్‌పీఐలు!
X

ముంబై: భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ మదుపర్లు పెట్టుబడులను తగ్గించారు. అంతకుముందు వరుస మూడు నెలల పాటు సగటున రూ. 40 వేల కోట్ల కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) ఆగష్టులో ఇప్పటివరకు రూ. 8,400 కోట్ల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి, చైనాలో ఆర్థిక ఆందోళన, దేశీయ ఆర్థిక స్థిరత్వం కారణంగా ఆగష్టు 1-18 తేదీల మధ్య దేశీయ మార్కెట్లలో రూ. 8,394 కోట్ల నిధులు వచ్చాయని డిపాజిటరీ గణాంకాలు తెలిపాయి. చైనాలో డిమాండ్ మందగించడంతో గ్లోబల్ మార్కెట్లు బలహీనపడ్డాయి.

ఈ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొనే పరిణామాలు ఎఫ్‌పీఐల పెట్టుబడులను ప్రభావితం చేస్తాయని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రిటైల్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు దేశీయ ఈక్విటీల్లో రూ. 1.31 లక్షల కోట్ల విలువైన నిధులు వచ్చాయి. ప్రధానంగా ఆర్థిక సేవలు, ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ రంగాల్లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారు.

Advertisement

Next Story