- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ నెలలో భారత ఈక్విటీ మార్కెట్లలోకి రూ. 12 వేల కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు!
ముంబై: ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు, ముఖ్యంగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని తగ్గించవచ్చనే ఆశతో విదేశీ మదుపర్లు భారత ఈక్విటీల్లో ఈ నెలలో ఇప్పటివరకు రూ. 12 వేల కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అంతకుముందు ఆగష్టులో రూ. 51,200 కోట్లు, జూలైలో దాదాపు రూ. 5 వేల కోట్ల పెట్టుబడులను విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) పెట్టారని డిపాజిటరీ గణాంకాలు తెలిపాయి.
గతేడాది అక్టోబర్ నుంచి వరుస తొమ్మిది నెలల పాటు ఎఫ్‌పీఐలు రూ. 2.46 లక్షల కోట్ల నిదులను భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత జూలై నుంచి విదేశీ పెట్టుబడిదారులు తిరిగి పెట్టుబడులను ప్రారంభించారు. అయితే, ప్రస్తుతం అధిక ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల ప్రతికూలత ఉండటంతో ఎఫ్‌పీఐల కొనుగోళ్లు అస్థిరంగా ఉన్నాయని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ 16 నాటికి మొత్తం రూ. 12,084 కోట్ల నిధులను ఎఫ్‌పీఐలు మదుపు చేశారు. ప్రతికూల పరిణామాలు ఉన్నప్పటికీ భారత మార్కెట్లపై విశ్వాసంతోనే వారు నిధుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నారని శ్రీకాంత్ పేర్కొన్నారు.