- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్రామీణంలో పెరుగుతున్న డిమాండ్
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య అమ్మకాల్లో 6.5 శాతం వృద్ధిని సాధించింది. గడిచిన ఐదు త్రైమాసికాల్లో గ్రామీణ వినియోగం మొదటిసారిగా పట్టణ ప్రాంతాలను అధిగమించినట్టు వినియోగదారుల పరిశోధన సంస్థ నీల్సన్ఐక్యూ తెలిపింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఆహార, ఆహారేతర రంగాలు రెండూ వినియోగంలో పెరిగాయి. ఆహారేతర ఉత్పత్తుల అమ్మకాలు దాదాపు రెట్టింపు పెరిగాయని నీల్సన్ఐక్యూ నివేదిక వెల్లడించింది. విలువ పరంగా కూడా పరిశ్రమ 6.6 శాతం వృద్ధి నమోదైంది. ప్రధానంగా గృహ, వ్యక్తిగత సంరక్షణ విభాగాల్లో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని నీల్సన్ఐక్యూ ఇండియా హెడ్ రూజ్‌వెల్ట్ డిసౌజా చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో వినియోగం చాలా వేగంగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పుంజుకోవడానికి తోడు, సంప్రదాయ అమ్మకాలు పెరగడం కూడా సానుకూల వృద్ధికి దోహదపడింది. ఆహారేతర ఉత్పత్తులు కాకుండా, గృహ సంరక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లలో వినియోగదారులు మెరుగ్గా ఖర్చు చేస్తున్నారు. సంప్రదాయ కిరాణా దుకాణాల్లో, హైపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌లో ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు గణనీయమైన వృద్ధిని చూశాయని నివేదిక పేర్కొంది.