- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Flipkart: డెలివరీల కోసం ఫ్లిప్‌కార్ట్ 10,000 ఎలక్ట్రిక్ వాహనాలు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈ-కామర్స్ మేజర్ ఫ్లిప్‌కార్ట్ తన డెలివరీ విభాగంలో ఇప్పటివరకు 10,000 ఎలక్ట్రిక్ వాహనాలను(ఈవీ) అందుబాటులోకి తీసుకొచ్చినట్టు సోమవారం ప్రకటనలో తెలిపింది. ఈవీలను తీసుకురావడం ద్వారా కార్యకలాపాల సామర్థ్యం గణనీయంగా మెరుగుపడింది. ఒక్కో ఆర్డర్ డెలివరీకి అయ్యే ఖర్చు తగ్గిందని, సాంప్రదాయ డెలివరీ వాహనాలతో పోలిస్తే 20 శాతం వేగం మెరుగుపడిందని కంపెనీ వెల్లడించింది. 2030 నాటీకి పూరిగా ఈవీ లాజిస్టిక్స్ లాస్ట్-మైల్ ఫ్లీట్‌ను సాధించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ఈ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో సహా టైర్-1 నగరాల్లో 75 శాతం ఈవీ వాహనాలను వాడుతున్నట్టు స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాల్లో ఈవీల వాడకాన్ని పెంచుతాం. ఇప్పుడున్న ఈవీల కోసం ఫ్లిప్‌కార్ట్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం భారీగా పెట్టుబడులు పెడతామని కంపెనీ సప్లై చెయిన్ గ్రూప్ హెడ్ హేమంత్ బద్రీ చెప్పారు. దీనికోసం కీలక ప్రాంతాల్లో 190 ఛార్జర్లను ఏర్పాటు చేశామని, 38 ఛార్జింగ్ సైట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అదానీ గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ఆయన వెల్లడించారు.