- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Banks Deposits: డిపాజిట్లను పెంచడంపై దృష్టి పెట్టండి: ఆర్థిక మంత్రి
దిశ, బిజినెస్ బ్యూరో: బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి రేటులో తగ్గుదల నమోదు కావడంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులకు కీలక సూచనలు చేశారు. గతంతో పోలిస్తే డిపాజిట్లు చాలా వరకు తగ్గుతున్నాయి. చిన్న పొదుపు దారులు కూడా స్టాక్ మార్కెట్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులను ఎంచుకుంటున్నారు. బ్యాంకు డిపాజిట్లను పెంచడానికి, రుణాల మధ్య పెరుగుతున్న అసమతుల్యతను పరిష్కరించడానికి బ్యాంకులు వినూత్న, ఆకర్షణీయమైన పథకాలను తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులతో జరిగిన సమావేశంలో నిర్మలా సీతారామన్ చెప్పారు. డిపాజిట్ సేకరణ, రుణాలు ఇవ్వడంతో పాటు కోర్ బ్యాంకింగ్‌పై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.
ఇదే సమావేశంలో పాల్లొన్న ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రసంగిస్తూ, డిపాజిట్‌లపై వడ్డీ రేట్లు, రుణాలపై నియంత్రణ తీసివేశాం. బ్యాంకులు తమ స్వంత వడ్డీ రేట్లను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉందని అన్నారు. పెరుగుతున్న క్రెడిట్ డిమాండ్‌ను తీర్చడానికి బ్యాంకులు స్వల్పకాలిక డిపాజిట్లపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. ఇది బ్యాంకింగ్ వ్యవస్థను లిక్విడిటీ సమస్యలకు గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి వినూత్న ఉత్పత్తులు, సేవా ఆఫర్ల ద్వారా వినియోగదారులు తమ పొదుపును బ్యాంకుల్లో డిపాజిట్ చేసేలా ప్రోత్సహించాలని అన్నారు. పెద్ద డిపాజిట్లతో పాటు చిన్న డిపాజిట్లను కూడా సమీకరించడానికి ప్రధాన్యత ఇవ్వాలని బ్యాంకులకు దాస్ సూచించారు. ఇండియా రేటింగ్స్ ప్రకారం, బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ వృద్ధి ఎఫ్25లో 12-13 శాతానికి మధ్యస్థంగా ఉంటుందని అంచనా. ఇది ఎఫ్24లో 13.8 శాతం నుండి తగ్గింది.