- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Imami: తప్పుదోవ పట్టించే యాడ్స్ ఇచ్చినందుకు ఇమామీకి రూ. 15 లక్షల జరిమానా

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామి లిమిటెడ్‌పై వినియోగం ఫోరమ్ రూ. 15 లక్షల జరిమానా విధించింది. కంపెనీకి చెందిన ఫెయిర్‌నెస్ క్రీమ్ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ యాడ్ మోసపూరితంగా, తప్పుదోవ పట్టించేదిగా ఉందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా, సెంట్రల్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ రిడ్రెసల్ కమిషన్ ఫిర్యాదును విచారణ చేపట్టింది. తాను 2013లో రూ. 79కి క్రీమ్‌ను కొనుగోలు చేశానని, అయితే ఆ ప్రోడక్ట్ తనకు ఫెయిర్ స్కిన్‌కు సంబంధించిన హామీని ఇచ్చినప్పటికీ, అది విఫలమైందని ఫిర్యాదుదారు తెలిపారు. ప్యాకేజింగ్, ప్రోడక్ట్ లేబుల్‌పై ఇచ్చిన సూచనల ప్రకారం ఉత్పత్తిని క్రమం తప్పకుండా ఉపయోగించానని ఫిర్యాదుదారుడు చెప్పారు. కానీ అతను అనుకున్న విధంగా ఫెయిర్‌నెస్ రాలేదని, ఇతర ప్రయోజనాలు కూడా ఏమీ లేవని వివరించాడు. అయితే, ఫిర్యాడుదారు కంపెనీ సూచనల ప్రకారం క్రీమ్‌ను ఉపయోగించినట్టు రుజువు కాలేదని, కాబట్టి ప్రోడక్ట్‌లో లోపం లేదని ఇమామి వివరించింది. కంపెనీ సూచనలను పాటించలేదని ఆరోపించడం ద్వారా ఫిర్యాదుదారుని తప్పుబట్టలేమని ఫోరమ్ పేర్కొంది. ఇది తప్పుదోవ పట్టించే యాడ్స్, అన్యాయమైన వాణిజ్య పద్దతులను సూచిస్తుందని అభిప్రాయపడింది.