- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Direct tax: పదేళ్లలో 182 శాతం పెరిగిన ప్రత్యేక్ష పన్ను వసూళ్లు
దిశ, బిజినెస్ బ్యూరో: గడిచిన పదేళ్ల కాలంలో భారత ప్రత్యక్ష పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 182 శాతం పెరిగి రూ. 19.60 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఆదాయపు పన్ను శాఖ తాజాగా విడుదల చేసిన టైమ్ సిరీస్ డేటా ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన మొత్తం వసూళ్లలో కార్పొరేట్ వసూళ్లు గడిచిన పదేళ్లలో రెండింతలు పెరిగి రూ. 9.11 లక్షల కోట్లకు, వ్యక్తిగత ఆదాయపు పన్ను నాలుగు రెట్లు పెరిగి రూ. 10.45 లక్షల కోట్లకు చేరుకున్నాయి. పదేళ్ల క్రితం 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు రూ. 6.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. అందులో కార్పొరేట్ పన్నులు రూ. 4.29 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్ను రూ. 2.66 లక్షల కోట్లు ఉన్నాయి. ఇదే సమయంలో 2014-15లో మొత్తం 4.04 కోట్ల ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు కాగా, 2023-24 నాటికి 8.61 కోట్లకు చేరాయి. ఇక పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2014-15లో 5.70 కోట్లు ఉండగా, 2023-25 నాటికి 10.41 కోట్లకు చేరారని నివేదిక పేర్కొంది.