మరింత వేగంగా భారత్‌లో విస్తరణ: డెకథ్లాన్ సీఈఓ

by S Gopi |
మరింత వేగంగా భారత్‌లో విస్తరణ: డెకథ్లాన్ సీఈఓ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఫ్రెంచ్ స్పోర్ట్స్ రిటైలర్ డెకథ్లాన్ భారత్‌లో ఉత్పత్తిని పెంచడమే కాకుండా మరిన్ని కొత్త రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు కంపెనీ సీఈఓ బార్బరా మార్టిన్ కపొలా చెప్పారు. ప్రపంచ మార్కెట్లలోనే భారత్ తమకు అత్యంత కీలకమైనది. దేశీయంగా వృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ రిటైలర్‌కు ముఖ్యమైన కేంద్రంగా మారుతోంది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లకు 65 శాతం ఉత్పత్తులను భారత్ ఎగుమతులు చేయగలుగుతోంది. '2009లో దేశీయంగా కార్యకలాపాలను ప్రారంభించిన తాము, ప్రస్తుతం 129 స్టోర్లను నిర్వహిస్తున్నాం. ఇది ఈ విభాగంలో ఉన్న ఇతర కంపెనీల కంటే రెండు రెట్ల వృద్ధిని సాధించగలిగామని' బార్బరా పేర్కొన్నారు. ముఖ్యంగా థానిక ఉత్పత్తులను సేకరించడం ద్వారా ఉత్పత్తిని వేగవంతం చేయనున్నాం. ప్రస్తుతం డెకథ్లాన్ తయారీలో 60 శాతం వస్తువులను స్థానికంగా సేకరిస్తున్నాం, వచ్చే రెండేళ్లలో దీన్ని 85 శాతానికి పెంచాలని లక్ష్యంతో ఉన్నామని ఆమె వెల్లడించారు. అంతేకాకుండా భారత్‌లో 65 శాతం ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. భవిష్యత్తులో ఇది మరింత పెరుగుతుందన్నారు.

Advertisement

Next Story