- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వరుస లాభాలకు బ్రేక్!
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. బుధవారం ఉదయం నుంచే ప్రతికూలంగా ట్రేడింగ్ మొదలైన సూచీలు రోజంతా అదే ధోరణిలో కదలాడాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక కంపెనీల షేర్లలో అమ్మకాలు ఊపందుకోవడంతో మార్కెట్లకు కలిసిరాలేదు.
ముఖ్యంగా అమెరికా రుణ పరిమితికి సంబంధించి బుధవారం మార్కెట్ల తర్వాత ఓటింగ్ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు బలహీనపడ్డాయి. ఆ ప్రభావం మన మార్కెట్లపై కూడా ఉంది. అలాగే, గత కొన్ని సెషన్ల నుంచి కొనసాగుతున్న ర్యాలీ కారణంగా దేశీయంగా మదుపర్లు గరిష్ఠాల వద్ద అమ్మకాలకు సిద్ధపడ్డారు.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 346.89 పాయింట్లు నష్టపోయి 62,622 వద్ద, నిఫ్టీ 99.45 పాయింట్లు కోల్పోయి 18,534 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా, రియల్టీ, హెల్త్‌కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి.
యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82,74 వద్ద ఉంది.