కొత్త గరిష్ఠాలకు సూచీలు

by S Gopi |
కొత్త గరిష్ఠాలకు సూచీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో రికార్డు ర్యాలీ కొనసాగుతోంది. అంతకుముందు సెషన్‌లో కీలక 78 వేల మార్కును దాటిన సెన్సెక్స్ ఇండెక్స్ బుధవారం ట్రేడింగ్‌లో సైతం అదే దూకుడుని కొనసాగించింది. ఈ క్రమంలోనే 78,759 వద్ద సరికొత్త గరిష్ఠాలను తాకింది. నిఫ్టీ సైతం 23,889 ఆల్‌టైం హై చేరింది. ప్రధానంగా ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు కీలక రిలయన్ షేర్లలో భారీ ఎత్తున కొనుగోళ్లు జరగడం మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 620.73 పాయింట్లు లాభపడి 78,674 వద్ద, నిఫ్టీ 147.50 పాయింట్ల లాభంతో 23,868 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్ ఏకంగా 4 శాతానికి పైగా పుంజుకోగా, భారతీ ఎయిర్‌టెల్, ఆల్ట్రా సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి. ఎంఅండ్ఎం, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.55 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed