ఈ ఏడాది భారత్‌లో సిట్రొయెన్ 200 కొత్త ఔట్‌లెట్లు

by S Gopi |
ఈ ఏడాది భారత్‌లో సిట్రొయెన్ 200 కొత్త ఔట్‌లెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రొయెన్ మరింత వేగంగా విస్తరించాలని భావిస్తోంది. దీనికోసం ఈ ఏడాది ఆఖరు నాటికి భారత మార్కెట్లో 200 కొత్త ఔట్‌లెట్లను ఏర్పాటు చేయనుంది. ఇది ప్రస్తుతం ఉన్న వాటి కంటే మూడు రెట్లు పెరగనుంది. ముఖ్యంగా పట్టణ, సెమీ అర్బన్, గ్రామీణ మార్కెట్లలో కొత్త డీలర్‌షిప్‌లను అందుబాటులోకి తీసుకొస్తామని సిట్రొయెన్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారులకు మరింత చేరువ కావాలని భావిస్తున్నాం. అందుకు ప్రధానంగా టైర్1, టైర్2 నగరాలకు తమ కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచనున్నామని సిట్రోయెన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ శిశిర్ మిశ్రా చెప్పారు. ఈ నగరాల్లో వినియోగదారుల ఆసక్తి, నాణ్యమైన ఉత్పత్తులు, సేవలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం గమనిస్తున్నాం. ఈ క్రమంలోనే చిన్న పట్టణాల్లో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. కాగా, సిట్రొయెన్ ఇండియా ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో రూ. 2,000 కోట్ల అదనపు పెట్టుబడులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story